24-09-2025 12:00:00 AM
-ఎస్పీతో కలిసి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. అనారోగ్య బారిన పడిన మా తల్లిదండ్రులను రిమ్స్‌లోనే వైద్య చికిత్సలు చేయించడం జరిగిందనీ, తనకు సైతం కాళ్ళు నొప్పి ఉండ డంతో రిమ్స్‌లోనే వైద్యం చేయించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలకు తెలియజేశారు.
గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామంలో మదన్ గిత్తే, జై దేవి మెడికల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరంను ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిపుణులైన వైద్యుల చే అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు బీపీ, షుగర్, వైరల్ జ్వరాల పరీక్షలు, రక్త పరీక్షలు, స్కానింగ్ సదుపాయం, అవసరమైన మం దుల ఉచిత పంపిణీ చేశారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ఈ సేవా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే వైద్యంపై పూర్తిస్థాయి లో నమ్మకం కల్గి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, తహశీల్దార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.