calender_icon.png 2 July, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేతుపతి సరసన సంయుక్త

18-06-2025 12:00:00 AM

విజయ్ సేతుపతి హీరోగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అన్ని ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ సినిమాలోని కీలక నటీనటుల వివరాలను ఒకరి తర్వాత ఒకరిని నిర్మాతలు ప్రకటిస్తున్నారు. టబు, దునియా విజయ్‌కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నట్టు గతంలో వెల్లడించిన మేకర్స్ ఇప్పుడు మరో అందాల భామ ఈ ప్రాజెక్టులో అడుగుపెడుతున్నట్టు తెలియజేశారు.

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంయుక్త ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాదని.. సంయుక్త పాత్ర కథనంలో కీలకంగా ఉంటుందని టీమ్ తెలిపింది. ఎమోషనల్ డెప్త్, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉండే పాత్రలో కనిపించనున్నందున కథ పట్ల, ఇందులో తన పాత్ర పట్ల సంయుక్త చాలా థ్రిల్ అయ్యిందట.

ఎప్పుడెప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారా? అన్న ఉత్సాహం ప్రదర్శిస్తోందట ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ షెడ్యూల్ కోసం లొకేషన్లను ఖరారు చేయడానికి టీమ్ ఇటీవల హైదరాబాద్, చెన్నైలలో రెక్కీని పూర్తి చేసింది. జూన్ చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.