calender_icon.png 22 November, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీరు వృథా కాకుండా సాగుకు వాడుకోవాలి

22-11-2025 01:53:58 AM

సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి): సాత్నాల ప్రాజెక్టు నుండి కెనాల్ ద్వారా విడుదలయ్యే నీటిని వృధా పోనివ్వకుండా సాగుకు వాడుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులకు సూచించారు. జిల్లాలోని సాత్నాల మండలంలోనీ సాత్నాల ప్రాజెక్టుకు గతంలో లెఫ్ట్, రైట్ కెనాల్ లకు లీకేజీ కారణంగా సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతుండగా, ఇటీవల కెనాల్ లకు మరమ్మతులు చేపట్టగా, శుక్రవారం సాగునీరు ను ఎమ్మెల్యే విడుదల చేశారు.

అనంతరం సైదుపూర్ గ్రామంలో రూ. 5 లక్షలతో నిర్మిం చే కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.... గతంలో లీకేజీ కారణంగా సాగు నీరుని సరిగ్గా రైతులు ఉపయోగించుకోలేకపోయారని, ఇప్పుడు పూర్తిస్థాయిలో సాగునీటి కోసం మరమ్మత్తు చేపట్టి నీటి విడుదల చేయడం జరిగిందని, ప్రాజెక్టుకు దిగువ లో ఉన్న రైతులు నీరును వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రాజెక్టు బండ్, గేటు, ఎలక్ట్రికల్, డ్రిప్ కోసం 16 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. రూ 6 కోట్లతో 130 కమ్యూనిటీ షెడ్ల నిర్మాణానికి ఇటీవల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వీటితో పాటు రూ. 25 లక్షల చొప్పున నాలుగు సార్ మేడి భవనాల నిర్మాణానికి సైతం కోటి రూపాయలు మంజూర య్యాయని తెలిపారు.  ఈ కార్యాలయంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.