calender_icon.png 1 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

01-10-2025 02:01:59 AM

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

ఘట్ కేసర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎన్నటికీ మరువలేనివని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. దసరా పండుగ సందర్బంగా పోచారం మున్సిపల్ పరిధిలోని పోచారంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సామల యాదిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ననావత్ రెడ్యానాయక్, మాజీ కౌన్సిలర్లు సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాల్ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మంద సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, నాయకులు సామల బుచ్చిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, కె.ఎం. రెడ్డి, దాసరి శంకర్, పెద్ద సంఖ్యలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.