calender_icon.png 1 October, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘టెట్’పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్

01-10-2025 12:43:30 AM

తీర్పును సమీక్షించాలని కోరిన ఎస్‌టీఎఫ్‌ఐ

ఆ తీర్పుతో 25 లక్షల మంది టీచర్లపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): ఉపాధ్యాయులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) అర్హత అంశంపై సుప్రీం కోర్టులో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీఎఫ్) పక్షాన ప్రధాన కార్యదర్శి చావ రవి పేరిట న్యాయవాది సుభాష్ చంద్రన్ మంగళవారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

ఐదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ పొందే టీచర్లలందరూ సర్వీసులో కొనసాగాలంటే తప్పని సరిగా రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలని, లేకుంటే ఉద్యోగం నుంచి రిటైర్ కావాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరినట్లు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఉపాధ్యాయులపైన ప్రభావం చూపనున్న తీర్పును సమీక్షిaంచి సవరించాలని కోరినట్లు పేర్కొన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్సీటీఈ కూడా త్వరగా రివ్యూ పిటిషన్లు వేయాలని వారు కోరారు.