calender_icon.png 1 October, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిత్య నిర్మాణ సంస్థకు ఊరట

01-10-2025 12:40:24 AM

హైకోర్టు ఆదేశాలతోనే మంచిరేవుల నిర్మాణాలకు అనుమతులు:హెచ్‌ఎండీఏ

హైదరాబాద్ సిటీ బ్యూరో సెప్టెంబర్ 30 (విజయ క్రాం తి): రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో వివాదాస్పదమైన ఆదిత్య నిర్మాణ సంస్థకు భవన నిర్మాణ అనుమతులను పునరుద్ధరించినట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ ఎండీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.   మూసీ నది బఫర్ జోన్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో గతంలో తామే రద్దు చేసిన అనుమతులను హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు ప్రకారమే పునరుద్ధరించాల్సి వచ్చిందని  స్పష్టం చేసింది.

గండిపేట మండలం, మంచిరేవుల గ్రామం లో 9.19 ఎకరాల విస్తీర్ణంలో బహుళ అంతస్తుల  భవన నిర్మాణానికి హెచ్‌ఎండీఏ 2022లోనే ఆదిత్య కేడియా రియాల్టర్స్ సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. 2023 జూలైలో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జరిపిన సంయుక్త తనిఖీల్లో. సదరు సంస్థ మూసీ నది బఫర్ జోన్‌ను ఆక్రమించి రిటైనింగ్ వాల్ నిర్మించినట్లు బయటపడింది.

దీంతో అదే ఏడాది ఆగస్టు 18న భవన నిర్మాణ అను మతులు రద్దు చేయడంతో పాటు, వివాదాస్పద రిటైనింగ్ వాల్‌ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆదిత్య సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పు అనుకూలంగా వచ్చిందని పేర్కొంది.