calender_icon.png 29 May, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం

27-05-2025 12:06:10 AM

అందరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 

రాజేంద్రనగర్, మే 26: కాంగ్రెస్ ప్రభు త్వం తోనే పేదలందరికీ న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ప్ర భుత్వం అనేక అనేక పథకాలను అమలు చే స్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.

సోమవారం నార్సింగి  మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట కమ్యూనిటీ హాలులో 238 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ మంజూరు పత్రాలను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కష్టసుఖాలు తెలిసినవారని, వారికి అవసరమైన అన్ని రకాల పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. పేద ప్రజల ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షలు ఉచితంగా ఇవ్వడం చరి త్రలోనే మొదటిసారని చెప్పారు. అధికారు లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, వారికి సహకరించి అన్ని వార్డులను అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని నాయకులకు ఆయన సూచించారు.

పనిచేస్తున్న అధికారులను తప్పు పట్ట డం మంచి పద్ధతి కాదన్నారు. ఇందిరమ్మ గృహాలు రానివారు ఇంకా ఎవరైనా ఉంటే రాబోయే రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

- కమిషనర్ తీరు సరికాదు

నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తీరు సరికాదని మాజీ కౌన్సిలర్ ఉషారాణి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆయన తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రాంతం లో అభివృద్ధి పనులు కావడం లేదన్నారు. ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని తిరగాలని ప్రశ్నించారు.

ఇప్పటికైనా ఆయన తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కె ట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వేణు గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నార్సింగి మున్సిపాలిటీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, లబ్ధిదారులుపాల్గొన్నారు.