calender_icon.png 8 May, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాకా ఫ్యామిలే కాంగ్రెస్‌కు పట్టాదారు

07-05-2025 12:00:00 AM

తాండూరు సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంచలన వ్యాఖ్యలు 

బెల్లంపల్లి అర్బన్, మే 6(విజయక్రాంతి) : బెల్లంపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణ సన్నాహక సమావేశాలు విస్తృతంగా జరుగుతున్నాయి. అందులో భాగం గా మంగళవారం  నియోజక వర్గంలోని తాండూర్ మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్ లో బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్ వెంకటస్వామి అధ్యక్షతన జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ రాజ్యాంగ పరిరక్షణ ముఖ్య కార్యకర్తల సమావేశo జరిగింది.

ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గోవర్ ఫెడరేషన్ చైర్మన్ టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకా ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ కి పట్టేదారులని వ్యాఖ్యానించారు. గడ్డం ఫ్యామిలీ అంటే మరకలేని కుటుంబమని పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఏ సమయంలో అయినా  మా ఇంటి తలుపు   తట్టచ్చని ప్రజలకు సందేశం ఇచ్చారు.

దేశ ప్రజలందరూ భారత రాజ్యాం గ పరిరక్షణలో భాగ్యస్వామ్యం అవ్వాలి రా జ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందనీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనీ పిలుపునిచ్చారు. ఈ సమావే శంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు  రజిత, టీపీసీసీ సభ్యులు చిలుముల శంకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.