23-12-2025 12:00:00 AM
పెంట్లవెల్లి, డిసెంబర్ 22: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేయాలని జూపల్లి అరుణ్ అన్నారు. కొండూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కేతూరి ధర్మతేజ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజకు అభినందనలు తెలిపారు.
గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, త్రాగునీరు, వీధి దీపాలు వంటి అంశాలపై సమిష్టిగా కృషి చేస్తూ కొండూరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు మాజీ సర్పంచ్ గోపాల్, ఉప సర్పంచ్ వడ్డేమాన్ రాముడు, వంగ రాజశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కురుమయ్య, పల్సర్ రవి, జెసిపి రాము పాల్గొన్నారు.