09-09-2025 11:35:58 PM
బెజ్జూర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని సిద్ధాపూర్ సమీపంలోని మత్త డి స్ప్రింగాణ కట్ట ను అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఏకమై మరమ్మతులు చేపట్టారు. మండలంలోని సిద్ధాపూర్,ఎలుక పల్లి, బెజ్జూర్ గ్రామాల రైతుల వందల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో గతంలోను మరమ్మత్తులను తూతు మంత్రంగా చేయడంతో పంట పొలాలకు నీరు అందడం లేదు.
పొలాలకు సాగునీరు అందడం లేదని అధికా రులకు, నాయకులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో రైతులందరూ ఏకమై మత్తడి స్ప్రింగాన కట్ట వద్ద సంచులలో ఇసుక నింపి పంట పొలాలకు సాగునీరు వచ్చేలా నీటికాలువను తాత్కాలికంగా మళ్ళించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతు లు పడుతున్న తిప్పలను చూసి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.