10-09-2025 12:47:16 AM
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి : సెప్టెంబర్ 09(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయిన పల్లి మండలం బడుగు బలహీన వర్గాల కు టుంబాలు ఆర్థికంగా సామాజికంగా అభివృ ద్ధి కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొ న్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మండలం కొదురుపాక గ్రామంలో దాదాపు 40 మంది లబ్ధి దారులకు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మినీ డైరీ కింద పాడి గేదెలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అనంతరం నిర్వహించిన సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులను వె నుకబడిన కుటుంబాలను స్వయం ఉపాధి కల్పించి వారి పిల్లలకు విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ ప్రభు త్వంలో 500 మంది దళిత వర్గాల బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు రూపాయలు 20 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడం చెప్పారు.
ఇన్ ఇండియా సమీకృత గు రుకుల నిర్మాణం ద్వారా దళిత వర్గాల విద్యార్థులకు మెరుగైన వస్తువులు కల్పన చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధి కంగా యూనిట్లు మందులు చేసినట్లు ఆయ న చెప్పారు. జిల్లాలో మానవతా దృక్పథంతో పనిచేసే కలెక్టర్ ఉండడం వల్ల పేద ప్రజలకు చక్కని ఫలితాలు అందుతున్నాయ ని చెప్పారు.
తీస్తున్నారని కలెక్టర్ ను ఎమ్మె ల్యే ప్రత్యేక అభినందించారు. ఈ కార్యక్రమం లో ముందుగా 40 మంది బాధితుల కు సీ ఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లా డుతూ షెడ్యూల్ కులాల సేవా సహకార సంస్థ అభివృద్ధి సంఘం లిమిటెడ్ ద్వారా 19 లబ్ధిదారులకు 18 గేదెలను పంపిణీ చే స్తున్న ట్లు చెప్పారు. ఇంకా గేదెలు కావాల్సిన కుటుంబాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని అర్హులైన వారికి చెప్పారు.
ప్రతి లబ్ధిదారుడు తీసుకున్న గేదెల పట్ల వాటి ఆరోగ్యం అందించాల్సిన ఆహారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను పశుసంవర్ధక శాఖ అధికా రుల సలహా సూచనలు తీసుకోవాలని ఆ యన కోరారు. ఈ సందర్భంగా కాలేజీ జ యంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కాళోజి చిత్రపటానికి పూలమాలలు వేసి ని వాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జి ల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఎంపీడీ వో భీమా జయశీల, బోయినపల్లి సింగిల్ ఉ న్న చైర్మన్ జోగినపల్లి వెంకట్రామారావు, ఉ మ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు ముదుగంటి సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బో యిని ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రె స్ నాయకులు భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అధికారులు ఉన్నారు.