05-05-2024 12:05:00 AM
తేజస్వీ యాదవ్ బదులు తేజస్వీ సూర్యపై విమర్శలు
మండీ, మే 4: ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో అటాక్ చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తుంటారు. అయితే ఓ ఎన్నికల సభలో ప్రత్యర్థిని విమర్శించబోయి సొంత పార్టీ నేతనే తీవ్రంగా దుయ్యబట్టారు. బీహార్ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను తిట్టబోయి.. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పేరును సంబోధించారు. తేజస్వీ సూర్య గూండాగిరి చేస్తుంటారని, చేపలు తింటారంటూ మండిపడ్డారు. ‘వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారో.. ఎక్కడికి వెళ్లాలో కూడా వారికి తెలియదు. చెడిపోయిన రాకుమారుల పార్టీల్లా మారాయి. చంద్రుడిపై ఆలు పండిచాలనుకుంటున రాహుల్ కావొచ్చు.. గూండాగిరి చేసి, ఎంతో ఇష్టంతో చేపలు తినే తేజస్వీ సూర్య కావచ్చు’ అంటూ విమర్శలు చేశారు. అయితే తేజస్వీ యాదవ్ బదులు తేజస్వీ సూర్య పేరు పలికిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.