12-11-2025 12:36:16 AM
నాగార్జున పల్లా, ఆధ్యరెడ్డి, భావన నీలప్ నాయకానాయికలుగా గ్రామీణ నేపథ్యంలో వాస్తవికతకు దగ్గరగా సాగే భావోద్వేగభరితమైన కథతో రూపొందిన చిత్రం ‘రోలుగుంట సూరి’. అనిల్‌కుమార్ పల్లా దర్శకత్వంలో తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ కార్యకమాన్ని నిర్వహించింది.
ఈ వేడుకలో హీరో నాగార్జున పల్లా మాట్లాడుతూ.. “నాకు ఇది ఫస్ట్ మూవీ. నేను స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి వచ్చాను. చాలా ఇష్టపడి చేశాను. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు” అన్నారు. ‘గీత రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అది మా చిత్ర యూనిట్‌కు కొత్త ఎనర్జీ వచ్చింద’ని చిత్ర దర్శకుడు అనిల్‌కుమార్ తెలిపారు.
“రోలుగుంట సూరి’ భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైంద”ని నిర్మాత సౌమ్య చాందిని చెప్పారు. ఈ సినిమాలో బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా, జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను చొప్ప ముఖ్యపాత్రల్లో నటించారు. సుభాష్ ఆనంద్, సందీప్ చక్రవర్తి సంగీతం అందించగా, ఎడిటింగ్, ఆడిషనల్ స్క్రీన్‌ప్లే బాధ్యతలను ఆవుల వెంకటేశ్ నిర్వర్తించారు. కథ, డైలాగ్స్ మహ్మద్ సాయి రాయగా, ఎస్ రమేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.