calender_icon.png 24 November, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటే పోటీ పరీక్షలు, బెల్టుల ప్రదానం

24-11-2025 12:03:34 AM

ముకరంపుర, నవంబరు 23 (విజయ క్రాంతి): ఒకినావా మార్షల్ ఆరట్స్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని భగత్ నగర్ సిద్దార్థ హైస్కూల్ లో కరాటే పోటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 180 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా కరాటేలోని వివిధ స్థాయి బెల్టులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన అడిషనల్ డి.సి.పి భీంరావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు ఆత్మవిశ్వాసానికై కరాటే శిక్షణ పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ విద్యాసంస్థల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, ఒకినావా కరాటే సంస్థల చీప్ ఎగ్జామినర్ కె. వసంత్ కుమార్, కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.