24-11-2025 12:05:09 AM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్, నవంబరు 23 (విజయ క్రాంతి): భారత దేశంలోనే ప్రధమంగా తెలంగాణ రాష్ట్రంలో.. అన్ని మతాలవారు ఘనంగా పండుగలను జరుపుకోవాలని .. పండగ కానుకలను అందించిన మొట్టమొదటి వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం నగరంలోని స్వశక్తి మహిళా భవన్ సమావేశ మందిరంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో..
ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఇందిర మహిళ శక్తి పథకం కింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో.. నిరుపేదలు పండుగలను ఘనంగా జరుపుకోవాలని భావించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలను.. రంజాన్ పండుగకు ముస్లింలకు బట్టలను..
క్రిస్టమస్ పండుగకు క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అందరూ పండుగలకు కొత్త బట్టలు కొనుక్కొని వేడుకలు జరుపుకోలేరని భావించి అలాంటి వారి కోసం కొత్త బట్టలను పం పిణీ చేయడం ఆనాడు కెసిఆర్ ప్రారంభించారని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా.. కొనసాగించడం సంతోషదాయకం అన్నారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, కొత్తపెళ్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత- మహేష్ గౌడ్, గ్రామీణ అభివృద్ధి శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తిరుపతి , అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి జే . రవికుమార్ , కొత్తపెళ్లి ఏపిఎం భువనచంద్ర , కరీంనగర్ రూరల్ మండలం ఏపిఎం రామ్మోహన్ , మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్, మాజీ సుడా డైరెక్టర్ నేతి రవివర్మ , బి ఆర్ ఎస్ నాయకులు పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మిడిదొడ్డి నవీన్, తదితరులుపాల్గొన్నారు.