24-09-2025 01:22:27 AM
ధాన్యం కొనుగోలు అంశంలో వ్యవసాయ శాఖ పోషించాల్సిన పాత్ర పై నిర్మించిన సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణు
పెద్దపల్లి, సెప్టెంబర్ 23(విజయ క్రాంతి) వానాకాలం 2025 సీజన్ ధాన్యం కొనుగో లు సజావుగా సాగేందుకు వ్యవసాయ శాఖ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదే శించారు.మంగళవారం అదనపు కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు అంశంలో వ్యవసాయ శాఖ పోషించాల్సిన పాత్ర పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం 2025 సీజన్ పంట కొనుగోలు సమయంలో సన్న రకం ధాన్యానికి కనీసం మద్దతు ధరకు అదనంగా రూ. 500 రూపాయల బోనస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతకు సంబంధించి ఏమై నా వివాదాలు తలెత్తితే వ్యవసాయ విస్తరణ అధికారులు పరిష్కరించాలని, అదే సమయంలో సన్న రకం ధాన్యం నాణ్యత ను మండల వ్యవసాయ అధికారులు పరిష్కరించాల్సి ఉంటుందని, కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని తగ్గించుటకు గాని వ్యవసాయ శా ఖ అధికారులు రైతులకు సూచనలు ఇస్తూ ఒకే సమయంలో కాకుండా దశలవారీగా వ రి కోతలు చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వ్యవసాయ విస్తర ణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరి కోతలు క్రమ పద్ధతిన జరిగేలా చూడాలని, కోతల సమయంలో హార్వెస్టర్లు 18 కం టే ఎక్కువ ఆర్.పి.ఎం నడిచేలా చూడాలని తద్వారా కోతల సమయంలోనే తాలూ చేత వంటి పదార్థాలు ధాన్యం నుండి వేరే చేయవచ్చని అన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ విస్తరణ అధికారికి ట్యాగ్ చేయాలని అన్నారు.
కొనుగోలు కేం ద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు రైతుకు టోకె న్లు ఇచ్చి క్రమ పద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా చూడాలని, రైతు లు పండించిన ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఎండబెట్టి టోకెన్ల ప్రకా రం కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని,కౌలు రైతులు పేద రైతులు చిన్నచిన్న కమతాలను సాగు చేస్తున్న రైతులు,
ప్రభుత్వ భూములలో అటవీ భూములలో పంటలు పండించే చిన్న కారు రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వ లేరని, వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ అంశాన్ని పరిశీలించి తగు ధ్రువీకరణ పత్రంతో 50 క్వింటాళ్ల వరకు ధాన్యం కొనుగోలు చేపట్టవచ్చని, 50 క్విం టాళ్ళకు మించి నట్లయితే సంబంధిత మం డల వ్యవసాయ అధికారి ధృవీకరించాల్సి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విస్తర ణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.