calender_icon.png 9 August, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ రంగంలో కరీంనగర్ జిల్లాకు రెండు జాతీయస్థాయి అవార్డులు

09-08-2025 12:00:00 AM

కరీంనగర్, ఆగస్టు 8 (విజయక్రాంతి):వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి గాను జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు వచ్చాయి.  ఇండో అ గ్రి,,‘సస్టైనబిలిటీ మ్యాటర్స్ సంస్థల ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన సస్టైనబుల్ అగ్రికల్చ ర్ సమ్మిట్లో ఈనెల జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తరపున జిల్లా అధికారులు ఈ అవార్డులు అం దుకున్నారు. రైతు సంక్షేమం కోసం సుస్థిర వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఈ అవార్డు దక్కింది.

( దేశ వ్యాప్తంగా ఈ అవార్డుకు ఇద్దరు కలెక్టర్లు మాత్రమే ఎంపికయ్యారు. పంజాబ్ రాష్ట్రం ఫిరోజ్ పూ ర్ కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్) మత్స్య సంపద అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి కరీంనగర్ జిల్లాలో అవలంబిస్తున్న వివిధ పద్ధతులకు గాను జిల్లా మత్స్య శాఖకు మరో అవార్డు అం దింది.వ్యవసాయ శాఖకు వచ్చిన అవార్డును జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాo కోఆర్డినేటర్ నీలం వెంకటేశ్వర్ రావు, మత్స్యశాఖకు వచ్చిన అవార్డును జిల్లా మత్స్యశాఖ అధికారి డాక్టర్ విజయభారతి న్యూఢిల్లీలో జిల్లా కలెక్టర్ తరఫున అందుకున్నారు.

సుస్థిర వ్యవసాయ విస్తరణ కోసం జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టి విజయవంతమైనాయి.ఎరువులకు ప్రత్యామ్నాయంగా జిల్లాలో 11652 హెక్టార్లలో పచ్చిరొట్ట సాగు. ఈ విధానం ద్వారా సుమారు 13 10 టన్నుల యూరియా ఆదా అయింది . నేరుగా వరివిత్తే పద్ధతి ద్వారా జిల్లాలో సుమారు 27 వేల హెక్టార్లలో వరి సాగు. ఈ విధానం ద్వారా కూ లీలకు కొరత అధికమించడంతోపాటు హెక్టారుకు పదివేల రూపాయలు రైతుకు ఆదా. జరిగింది. కరీంనగర్ జిల్లాలో చెరువులు కుంటలు జలాశయాల్లో మత్స్య సంపద అభివృద్ధి జరిగింది. ఇత ర జిల్లాల్లోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలకు ఇక్కడి నుంచి సీడ్స్ ఎగుమతిచేశారు. ఎం జి ఎన్ ఆర్ ఈజీఎస్ లో భాగంగా చేపల కొలనుల ఏర్పాటు చేశారు.స్వయం సహాయక సంఘా ల సభ్యులకు చేప పిల్లల పెంపకంపై అవగాహనకల్పించారు.