calender_icon.png 24 October, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

23-10-2025 08:23:15 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన మేరుగు సుగుణమ్మ ఇటీవల గుండెపోటుతో మరణించిగా గురువారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సుగుణమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు మేరుగు యాదగిరి, మెరుగు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సాయిరి మహేందర్, చిలుక సతీష్, వేగోలం అబ్బయ్య గౌడ్, ముస్త్యాల రవీందర్, డి. రాజయ్య, సామల రాజేంద్ర ప్రసాద్, అంతటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.