11-10-2025 07:25:03 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద శనివారం కార్తీకమాసం వేడుకలకు సంబంధించి దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. భారీగా కురిసిన వర్షాల కారణంగా దేవస్థానం ముందు భాగం బురదగా మారడంతో మొరంతో చదును చేయించారు. ఆలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించి మట్టి రోడ్లను చదును చేశారు. భక్తుల సౌకర్యార్థం కోనేరులో కొత్త నీటిని నింపారు. కార్తీక పౌర్ణమి మాసంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా ఏర్పాట్లను ప్రారంభించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ క్లర్క్ భాను తెలిపారు.