10-11-2025 12:00:00 AM
కొమురవెల్లి, నవంబర్ 9 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వా మి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారానికి పవిత్ర కార్తీక మాసం తోడవడం తో మల్లన్న స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే భక్తుల కోలహాలం మొదలైంది. స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి గంటన్నర పైగా సమయం పట్టిం ది.
భక్తులు ముందుగా స్వామివారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంత రం గర్భాలయంలో ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మొక్కుబడులలో భాగంగా స్వామివారికి పట్నాలు, నిత్య కళ్యాణాలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించు కున్నారు. అదేవిధంగా కొండపైనున్న ఎల్ల మ్మ తల్లికి బోనాలు సమర్పించి, ‘ మమ్ము కరుణించు తల్లి‘ అని భక్తితో వేడుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు.