28-05-2025 12:45:51 AM
- షర్మిల పార్టీలాగే కవిత పార్టీ పరిస్థితి
- ఎంపీ రఘునందన్‌రావు
తూప్రాన్, మే 27: జూన్ 2న ఎమ్మెల్సీ కవిత తన పార్టీని ప్రకటించే అవకాశం లేకపోలేదని మెద క్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూతురు అయిన కవిత పార్టీ పెట్టాలనుకోవడం హాస్యాస్పదమని, పదేళ్లు బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజాధనాన్ని దోచుకుంటే ఇప్పుడు కవిత రెండో పార్టీగా అవతారమెత్తుతుందని రఘునందన్‌రావు సంచల న వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో పోస్టాఫీస్‌ను ప్రారంభించారు. అంతకుముందు తూప్రాన్‌లోని మహాంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో దేవుడి పక్కన దయ్యాలుంటే పదేళ్లు ఏం చేశావని కవితను ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్న నెపంతో కవిత సొంత పార్టీ పెట్టాలని పూనుకున్నట్లు చెప్పారు. కవిత పార్టీ పెడితే షర్మిల పార్టీలాగే ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్‌లో ఒకరితో గొడవ పడితే మరొకరి దగ్గరికి పోయేలా గ్రూపులు తయారు చేస్తున్నారని విమర్శించారు.