17-11-2025 01:12:46 AM
హరీష్ రావు ను విమర్శించే అర్హత లేదు: జడ్పీ మాజీ చైర్మన్ సురేందర్
నల్గొండ టౌన్, నవంబర్ 16: ఎమ్మెల్సీ కవిత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అన్నారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హరీష్‌రావు 2001 నుండి నిఖార్సయిన ఉద్యమకారుడు.ఎన్నో అటుపోట్లు పడుతూ పోరాటం చేసిన వ్యక్తి హరీష్ రావు.. హరీష్ రావు గారి క్యారెక్టర్ పై కవిత సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు.
హరీష్ రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత ఎక్కడో విదేశాల్లో ఉంది..ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ వాల్లమో మంచి అయ్యారు.. బి ర్ ఎస్ పార్టీ వాల్లేమో చేదు అయ్యారు. నువ్వు ఎవరి చేతిలో కీలు బొమ్మగా మారావో అందరికి అర్థం అవుతుంది. కేటర్‌పై, హరీష్ రావుపై, జగదీష్ రెడ్డిపై అనవసరంగా నోరు పారేసుకోవద్దన్నారు. కాంగ్రెస్ ఎజెండాని ఎజెండా ఒకటేగానే ఉంది.
కుట్రలు పన్ని హరీష్ రావు గారిని ఒంటరి చేయాలని కుట్ర చేస్తున్నావ్.. ని జాగృతి ఎక్కడ లేదు.. బీఆర్‌ఎస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి నీకు హారతులు పట్టి నీకు గుర్తింపు వచ్చేలా కష్టపడ్డాం.. ఇవ్వాళ నీకు బీఆర్‌ఎస్ అంటే పడటం లేదన్నారు ముమ్మాటికీ సీఎం రేవంత్ రెడ్డి కోవర్ట్ కవిత..నీకు బంగ్లాలు కార్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. హరీష్ రావుపై అవినీతి మరక అంటించి బీఆర్‌ఎస్ పార్టీని చీల్చే కుట్ర చేస్తుంది..
కవిత చేస్తున్న వ్యవహారం తో మా కేసీఆర్ ఆత్మ క్షోభిస్తున్నది... ఆయన ను బాధపెట్టినువ్వుఎంసాధిస్తావ్ అన్నారు. ఎప్పటికైనా కేసీఆర్‌రే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. జూబ్లీహిల్స్ లో అడ్డదారిలో కాంగ్రెస్ గెలిచిందన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ ఛైర్మెన్ సైదిరెడ్డి నాయకులు అభిమన్య శ్రీనివాస్ మాలే శరణ్య రెడ్డి, యుగంధర్ రెడ్డి జంగయ్య యాదవ్, సత్యనారాయణ పాల్గొన్నారు.