17-11-2025 01:10:15 AM
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): ఉపరాష్ర్టపతి సీపీ రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు.
ఉపరాష్ర్టపతి రాకతో రాజ్‌భవన్‌లో గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు.