09-08-2025 03:13:24 AM
బీఆర్‌ఎస్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుంబం అలీబాబా 40 మంది దొంగల ముఠా అని, అందులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒక సభ్యుడని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. ‘కాళేశ్వరం దోపిడి మీదే.. ఇసుక మాఫియా మీదే.. లిక్కర్ దందా మీ కుటుంబానిదే.. తెల్లారే వరకు పబ్బులు నడిపిం చేంది మీ కుటుంబమే.. భూములు లాక్కోవడం.. చెరువులు మింగడం మీ కుటుంబా నిదే.. అవినీతికి ఫ్రొపెసర్లు మీరు’ అని జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెద్దమ్మగుడి కమాన్ నుం చి మాదాపూర్ వరకు లిక్కర్ దందా కేటీఆర్, సంతోష్‌దేనని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి రీవేంజ్ తీర్చుకోవాలనుకుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోవాలని కేటీఆర్, హరీశ్‌లను హెచ్చరిం చారు. సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పోలీసులతో ఎన్నో ఇబ్బందులు పెట్టారని నాపై అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయలేదా? అని జగ్గారెడ్డి నిలదీశారు. కేసీఆర్ కుటుంబం చేసిన తప్పులకు చట్టపరంగా విచారణ చేయించి తగిన గుణపాఠం చెప్పాలనే ప్రభుత్వం చూస్తోందని, పోలీసులతో ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు.
రాజకీయంగా నీ వెంత.. నీ బతుకెంత
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫైరయ్యారు. రాజకీయంగా నీవెంత.. నీ బతుకెంత? నీకున్నంత ఆస్తి ఉంటే.. గంటలో పంచేవాణ్ని. నీ దగ్గరున్న వెయ్యి కోట్లను పంచేంత మొగతనం ఉందా? నీవు ఫ్యాకేజీ లీడర్‌వు.. పబ్లిక్ లీడర్‌వు కాదు. నీలాగా నేను బీభై కొనుక్కొనే లీడర్‌ను కాదు.. నాపై విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. నా గురించి కేసీఆర్, హరీశ్‌రావును అడుగు చెబుతారు. నా క్యారెక్టర్‌ను అంచనా వేయలేవు. నీకు, నాకు చాలా తేడా ఉంది. నీ దగ్గర ఉన్నంత ఆస్తి నాకు ఉంటే రైతులకు పంచేవాడిని. నా టైమ్ బాగుండి వెయ్యి కోట్లు సంపాదించినా జనానికి పంచుతా. నా దగ్గరికి పేదవాళ్లు వస్తారు. క్యాన్సర్ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి సాయం చేస్తా’ అని జగ్గారెడ్డి అన్నారు.