02-09-2025 12:18:19 AM
పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు జైలుకెళ్లక తప్పదని పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ విచారణకు ఇవ్వడమంటే అసాధారణ నిర్ణయమని తెలిపారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్, హరీశ్‌రావు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బండి డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం దో చుకున్న ప్రజాధనాన్ని తెలంగాణ ప్రభుత్వం రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తోందని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందే హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
కేసీఆర్, హరీశ్‌రావు ఏ తప్పు చేయకుంటే కాళేశ్వరం కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా స్టే కోసం కోర్టుకెందుకు వెళ్లారని బండి సుధాకర్‌గౌడ్ నిలదీశారు. కాళేశ్వరం అవినీతి ఎంత దాచిపెట్టినా దాగేది కాదని, తెలంగాణ ప్రజలు సహించినా ప్రకృతి మాత్రం సహించలేకపోయిందన్నారు.