calender_icon.png 17 September, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్రాంతి తరువాత కేసీఆర్ అమెరికా టూర్

16-12-2024 01:04:59 AM

మనువడితో గడిపేందుకు యూఎస్‌కు..

హైదరాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి తరువాత అమెరికాకు వెళ్లనున్నట్లు తెలంగాణ భవన్‌లో టాక్ వినిపిస్తోంది. ఆయన సీఎంగా ఉన్న సమయంలో బిజీగా గడపడంతో పదేళ్లలో రెండు విదేశీ పర్యటనలే చేశారు.

ఒకసారి చైనా, మరోసారి సింగపూర్‌కు వెళ్లి.. దేశంలో విదేశీ పర్యటనలు తక్కువ చేపట్టిన ముఖ్యమంత్రిగా నిలిచారు. కచ్చితమైన తేదీలు మాత్రం ఖరారు కాలేదని, పర్యటన మాత్రం ఉంటుందని పార్టీ సీనియర్లు చెప్పారు. కేటీఆర్ తనయుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యనభ్యసిస్తుండటంతో కొన్ని రోజులు అతనితో గడిపేందుకు వెళ్లనున్నారు.

మరో పక్క విద్యుత్తు కుంభకోణంలో అరెస్టు తప్పదనే భయంతో ముందుగా అమెరికాకు వెళ్తున్నట్టు కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి పాల్పడిన నేతలకు ఎప్పటికైనా శిక్ష తప్పదని.. చట్టం తన పని చేసుకుంటూ పోతుందని వారు అంటున్నారు.