calender_icon.png 30 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ లబ్ధికే కేసీఆర్‌కు నోటీసులు

30-01-2026 01:07:58 AM

  1. ట్యాపింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌గా లేదు
  2. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయనే, వాటిలో లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపిం చారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కవిత గురువారం మీడియా ముందు స్పం దించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణను పూర్తి చేసి కేసును కంక్లూడ్ చేయాలని సూచించారు.

కానీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం డైలీ సీరియల్ లాగా సాగదీస్తోందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కచ్చితంగా చాలా బాధాకరమైన అంశమని, దీనిని ఎవరూ సమర్థించరని వెల్లడించారు. ఈ అంశంలో నేరస్తులకు ప్రభుత్వం తగిన శిక్ష వేసేలా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ కేసు పర్యవసానాలను నేరస్తులు ఎదుర్కొంటారా లేదా అన్నది వేచి చూడాలని తెలిపారు.