calender_icon.png 22 August, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరంతరం నిఘా ఉంచండి

22-08-2025 01:04:03 AM

  1. ప్రజలకు ఇబ్బందులు రానివ్వకండి 

ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్

మహబూబ్ నగర్ ఆగస్టు 21 (విజయ క్రాంతి) : ప్రజలకు ఇబ్బందులు రాకుండా నిరంతరం నిగా ఉంచాలని రెవెన్యూ(విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అరవింద్ కుమార్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన ప్రాంతాలను పరిశీలించిన రెవెన్యూ(విపత్తుల నిర్వహణ శాఖ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ దివిటిపల్లి అమరాజా ఫ్యాక్టరీ కి వెళ్ళే టి.జి. ఐ ఐ.సి. కాంప్లెక్స్ వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డును,

అనంతరం అమిస్తాపూర్ నుండి రామదాసు తండా మధ్య దెబ్బతిన్న రోడ్డు ను, జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కాలేజీ వెళ్ళే వర్షపు నీటి తో నిండిన రైల్వే అండర్ బ్రిడ్జి ని ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న రహదారి,రైల్వే అండర్ బ్రిడ్జి పునరుద్ధరణ పనులు గురించి వివరించిన కలెక్టర్ వి జ యేందిర బోయి,సంబంధిత రైల్వే,మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. చిట్టిబోయిన పల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల,

వంటగది స్టోర్ ను, జూనియర్ కళాశాల ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేసిన విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు. గురుకుల పాఠశాలలో వంట గది, స్టోర్ రూమ్ పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరం ద్వారా మండల అధికారులతో వీసీ ద్వారా పలు అంశాలను వివరించారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణమే చర్యలు తీసుకునేలా ముందుకు సాగాలని సూచించారు. ఈ వీసీ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి జానకి, సంబం ధిత అధికారులు ఉన్నారు.