calender_icon.png 19 August, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక భేటీ

19-08-2025 12:34:26 AM

  1. భారత్‌పై అమెరికా అదనపు సుంకాల నేపథ్యంలో సమావేశం
  2. అమలవుతున్న 25 శాతం సుంకాలు, 27 నుంచి అమల్లోకి మరో 25 శాతం 

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అగ్రస్థాయి మంత్రులు సోమవారం ఢిల్లీలో  సమావేశం అయ్యారు. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుంటున్నామనే ఆరోపణలతో అమెరికా భారత్‌పై విధించిన సుంకాలు, వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తర్వాతి తరానికి  కావా ల్సిన రోడ్ మ్యాప్ గురించి చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.

నేటి నుంచి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలి కాలంలో భారత్ అమెరికా కు దూరం అవుతూ చైనాకు దగ్గరవు తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై అదనపు సుంకాలు ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే మోదీ అధ్యక్షతన ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సమావేశం కావడం గమనార్హం.

ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కీలక క్యాబినెట్ మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం గురించి ప్రధా ని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు రత్నాలు, ఆభర ణాలు, టెక్స్‌టైల్, పాదరక్షలు వంటి 40 బిలియన్ యూఎస్ డాలర్ల ఎగుమతులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై ఈ సుంకాలు విధించారు.

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలలో 25 శాతం సుంకాలు ప్రస్తుతం అమలవుతున్నా యి. మరో 25 శాతం సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. అమెరికాభారత్‌లు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని వీలై నంత త్వరగా ఖరారు చేసేందుకు ప్రయత్నా లు చేస్తున్నాయి.