calender_icon.png 27 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం

27-12-2025 01:56:56 AM

* రూ.30 కోట్లతో ఇండోర్ స్టేడియం, సింథటిక్ ట్రాక్

* ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

పటాన్ చెరు, డిసెంబర్ 26 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం డివిజన్ పరిధిలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొం దించడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన వసతు లతో కూడిన స్టేడియం అందించా లన్న సమున్నత లక్ష్యంతో రూ.30 కోట్లతో ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యాకి ప్రతి పాదనలు పంపినట్లు పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, బొల్లారం డిప్యూటీ కమి షనర్ కిషన్ లతో స్టేడియం ఏర్పాటుపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బొల్లారం డివిజన్ పరిధిలో స్టేడియం ఏర్పాటు కోసం గతంలోనే ఐదున్నర ఎకరాలు కేటా యించడం జరిగిందని తెలిపారు. ఈ స్థలంలోనే కేంద్ర ప్రభు త్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఖేలో ఇండియా స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపుతున్నామని తెలిపారు. 9:30 కోట్ల రూపాయలతో సింథటిక్ ట్రాక్, 14 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి శివారులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద స్టేడియాన్ని అభివృద్ధి పరిచేందుకు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు.

అతి త్వరలో నిధులు మంజూరు కాబోతున్నాయని తెలిపారు.. స్టేడియం పరిధిలో 10 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, మూడు కోట్ల 15 లక్షల రూపాయలతో స్విమ్మింగ్ పూల్, 6 కోట్ల 50 లక్షల రూపాయలతో సింథటిక్ ట్రాక్, 35 లక్షల రూపాయలతో బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా పటాన్ చెరు మైత్రి మైదానంలో ఖేలో ఇండియా కబడ్డీ అకాడ మీ మంజూరు అయిందని తెలిపారు. 20 సంవత్సరాల లోపు బాలురు, బాలికలు కబడ్డీ క్రీడలో శిక్షణ పొందవచ్చును తెలి పారు. చిన్న కేంద్రం ఏర్పాటుకు ఏడు లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు.  రాబోయే జనవరి నెల లో అకాడమీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సమావే శంలో జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్రెడ్డి పాల్గొన్నారు.