calender_icon.png 23 July, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

23-07-2025 01:04:07 AM

- దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలి

- 25వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు అన్ని గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ

- కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, జూలై ౨2 (విజయక్రాంతి): జిల్లా లో భూభారతి చట్టం ద్వారా వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి వచ్చే నెల 15 లోపు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం హైదరాబాదు నుండి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పున్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేసినట్టు తెలిపారు.

భూభారత చట్టం దరఖా స్తుల పరిష్కారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు అంశాలపై జిల్లా వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను వారికి వివరించడం జరిగిందని తెలిపారు అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి గ్రౌండింగ్ చేపట్టిన వారు, ఇంటి నిర్మాణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలని అన్నారు. ఆగస్టు 15 వ తేదీ లోపు భూ సమస్యలను అన్నింటిని భూ భారతి చట్టాన్ని అనుసరించి పరిష్కరించాలని అన్నారు. నోటీసులు జారీ చేసిన దరఖాస్తుదారుల భూ సమస్యలపై విచారణ జరపాలని పేర్కొన్నారు. ఈ నెల 25 వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు అన్ని గ్రామాలలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులైన ప్రజలందరికీ అందేలా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు సరిపడినంత యూరియా, ఇతర ఎరువులు అందుబాటు లో ఉండేలా చూడాలన్నారు. ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్న కళ్యాణి, కోమల్ రెడ్డి, జెడ్పి సీఈవో గోవిం ద్, డీఈఓ పి. రామారావు, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్‌ఓ రాజేందర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు రాజేశ్వర్ గౌడ్, అంబాజీ శ్రీనివాస్, మోహన్ సింగ్, ఎక్సైజ్ అధికారి ఎం.ఎ. రజాక్, హౌసింగ్ పిడి రాజేశ్వర్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.