24-09-2025 12:00:00 AM
విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) ః జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణాన్ని సుందరీకిరణ చేయడానికి పట్టణంలోని ప్రధాన రోడ్లన్నీ విస్తరణ చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆదర్శంగా ఉండే విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని ఆ దిశలో అధికారులు తాము పని చేస్తున్నామన్నారు.
అందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. జగ్దేవ్ పూర్ చౌరస్థా నుండి ఆర్డీవో ఆఫీస్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను మంగళవారం నాడు ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు మున్సిపల్ కమిషనర్ రామలింగం ఇతర అధికారులతో కలిసి తిరిగి పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ. జగదేవ్ పూర్ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని ఎక్కువ వర్షాలు పడి గుంతలు ఏర్పడి ప్రణాలు పోతున్నాయని అన్నారు. వాటిని నివారించడానికి రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు.
రోడ్డు వెంబడి ఆక్రమించి ఉన్న షాప్ లు తీసేయాలని, జీవనోపాది కోల్పోకుండా అంతకు ముందు నిర్మించి ఉన్న షాప్ లు యధావిధిగా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రధానంగా ప్రమాదాలు, ట్రాఫిక్ జాం ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ ప్రాంతం అంతా రోడ్డు విస్తరణ జరిగిందన్నారు. కాంక్రీటింగ్, బీటీ వేయాల్సి ఉందని... రోడ్డుకు ఇరువైపులా డ్రెయిన్, గ్రిల్స్, ఫుట్ పాత్ ఏర్పాటుచేసి ఇబ్బందులు కలగకుండా అధునాతనంగా చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.