12-09-2025 01:14:39 AM
క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్
ఖైరతాబాద్; సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి) : ప్రతిష్టాత్మక కోహినూర్ థియేటర్ కార్నివాల్ తెలంగాణ జాతీయ నాటకోత్సవాలు ఈ నెల 15, 16, 17 తేదీలలో ఘనం గా నిర్వహించనున్నట్లు క్రియేటివ్ థియేటర్ వ్యవస్థాపకులు అజయ్ మంకెనపల్లి తెలిపారు.
ఈ మేరకు గురువారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రవీంద్రభారతిలో, బంజారాహిల్స్‌లోని ఓరైన్ కేఫ్‌లో జరిగే ఈ నాటకో త్సవాలకు తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ సహకారం ఇస్తున్నాయని తెలిపారు.
ఈ మూడు రోజులు డప్పు, కలరీ, ఒగ్గుడోలు, పేరిణి, యాక్టింగ్ వర్క్ షాప్, మైన్ వర్క్ షాప్, బాడీ మూమెంట్, రైటింగ్, కర్రసాము, లైటింగ్ డిజైనింగ్ వంటి వర్క్ షాపులు జరుగుతాయని అన్నారు.కేరళ, కర్నాటక, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాటకాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉత్సవాలకు సినీ, రాజకీయ, యూని వర్సిటీ, కాలేజీ, స్కూళ్ల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో క్రియేటివ్ థియేటర్ ప్రతినిధులు రామ్ హోలగోడి, అనిల్, ప్రణయ్, హర్ష, కిరీటి శరత్ తదితరులు పాల్గొన్నారు.