calender_icon.png 23 November, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి దశలో కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ పనులు

23-11-2025 01:12:40 AM

ఇప్పటి వరకు 96 శాతం పూర్తి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): కొమురవెల్లి రైల్వే స్టేషన్ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన పనుల పురోగతిపై ట్వీట్ చేవారు. సిద్దిపేట జిల్లా- కొమురవెల్లి మల్లన్న భక్తుల కోరిక మేరకు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త రైల్వే స్టేషన్ పనులు చివరి దశలో  ఉన్నాయని, ఇప్పటి వరకు 96 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించా రు.

అతిత్వరలో ఈ స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నుంచి రోజూ వేలాదిగా భక్తులు కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్తుంటారని, నూతన రైల్వే స్టేషన్ నిర్మాణంతో భక్తుల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం మెరుగవనుందని పేర్కొన్నారు.