calender_icon.png 22 August, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం

22-08-2025 01:48:36 AM

బీజేపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

భద్రాద్రికొత్తగూడెం, ఆగస్టు 21 (విజయ క్రాంతి): క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. గురువా రం రామవరం సాధన గ్రౌండ్ నందు అంబేద్కర్ ఐటీఐ కరస్పాండెంట్ వెలన్ కుమార్ తండ్రైన దొరై మెమోరియల్ రెడ్ బాల్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ముందుగా క్రీడాకారులను పరిచ యం చేసుకొని పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉ ల్లాసానికి దోహద పడతాయని, ప్రతీ పోటీల్లో గెలుపు, ఓటములు సహజమని గెలుపొందిన వా రు ఇంకా శ్రమిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఓటమి చెందిన వారు మరింత సాధన చేసి భవిష్యత్ లో గెలుపొందుట కు కృషి చేయాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సక్రమమైన మార్గంలో వెళ్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూ చించారు.

ప్రస్తుత తరుణంలో క్రికెట్ పోటీలను నిర్వహించడం ఆషామాషీ విషయం కాదని పో టీలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు.క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని ఆకాక్షించారు కామేష్ కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు..ఈకార్యక్రమంలో వెలెన్ కుమార్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దేవీప్రసన్న, మోరె రమేష్,అప్పారావు,అశోక్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.