calender_icon.png 9 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

09-07-2025 12:11:29 AM

11 మంది అరెసు, రూ.43వేలు స్వాధీనం, 9 సెల్ ఫోన్లు, 9 బైకులు సీజ్

హుస్నాబాద్, జులై 8 : సిద్దిపేట టాస్క్ ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు మంగళవారం సాయంత్రం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో, హుస్నాబాద్ మండలం పొట్లపల్లి పరిధిలోని దేవేంద్రనగర్ లో ఓ పశువుల కొట్టంలో జరుగుతున్న పేకాట స్థావరంపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.43,099 నగదు, 9 మొబైల్ ఫోన్లు,  9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు హుస్నాబాద్ పోలీసులు, సిద్దిపేట టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి దేవేంద్రనగర్ లోని వడ్లూరి లక్ష్మణ్ పశువుల కొట్టంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న పది మందితో పాటు, పశువుల కొట్టం యజమాని వడ్లూరి లక్ష్మణ్ను కూడా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో హుస్నాబాద్ కు చెందిన దొంతరవేని ఐలయ్య, బొర్రా శ్రీనివాస్, చెన్నూరి శ్రీనివాస్, కుట్లు రాజయ్య, బసవేని సాగర్, ఐపాక శ్రీనివాస్, పత్రి మహేందర్, మహమ్మద్ షబ్బీర్, వంతడుపుల వెంకటస్వామి, తూర్పాటి అనిల్ ఉన్నారు.

హుస్నాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా, టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాలు, పట్టణాలు, ఫామ్ హౌస్లు, ఇండ్లలో ఎవరైనా పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే, వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యవసరం అని అన్నారు.