calender_icon.png 23 December, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలి రోజు సెట్ ప్రశాంతం

23-12-2025 12:14:26 AM

  1. రెండు సెషన్స్ కలిపి 15,705 మంది దరఖాస్తు
  2. మంగళ, బుధవారాల్లో కూడ పరీక్ష నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ ఎలి జిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్) తొలి రో జు పరీక్షను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించినట్లు ఉస్మాని యా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. సోమవారం వర్సిటీ ప్రాంగణంలోని టీజీ సెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీసీ ప్రొ ఫెసర్ కుమార్ మొలుగరం ఉద యం 8.30 గంటలకు పరీక్ష పాస్‌వర్డ్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షను ప్రారంభించారు.

తొలి రోజు రెండు సెషన్‌లో కలిపి 15,705 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 23, 24న కూడా పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షలకు హాజరైన అభ్యర్థుల పూర్తి వివరాలు అన్ని పరీక్షలు ముగిశాక ప్రకటిస్తామని ఓ సెట్ అధికారి తెలిపారు. అన్ని పరీక్షలకు కలిపి మొ త్తం 45,127 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.