17-08-2025 12:01:53 AM
- ఉద్యమకారుడినని చెప్పుకొనే వాళ్లకు.. టీవీలు, పేపర్లు, వేల కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినయ్?
- తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తినింపిన కవులు గూడ అంజయ్య, అందెశ్రీ, గద్దర్, గోరటి వెంకన్న
- అద్దాల మేడలు, రంగుల భవనాలు అభివృద్ధి కాదు
- హసిత భాష్పాలు పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయ క్రాంతి): ‘మేం ఉద్యమకారులం కాదు. గాలి ఎటు వీస్తే అటు వెళ్లే రాజకీయ నాయకులం. ఉద్యమకారుడినని చెప్పుకొని తిరిగే వాళ్లకు టీవీలు, పేపర్లు, వేలకోట్ల ఆస్తులు ఎలా వ చ్చాయి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్ర శ్నించారు. టీజీ జెన్‌కో ఆడిటోరియంలో ప్ర ముఖ కవి అందెశ్రీ రాసిన ‘హసిత భాష్పా లు’ పుస్తకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పుస్తక రచయిత శ్రీరామ్ పాలమూరు బిడ్డ కావడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ సమా జం కవులకు స్ఫూర్తినిచ్చిన గడ్డ అని, నిజమై న ఉద్యమకారులెవరూ తాను ఉద్యమ కా రుడినని చెప్పుకోరని తెలిపారు. అందెశ్రీ ఎ ప్పుడూ ఉద్యమ కారుడినని చెప్పుకోలే దని సీఎం పేర్కొన్నారు. గూడ అంజయ్య, అందె శ్రీ, గద్దర్, గోరటి వెంకన్న లాంటి కవులు తె లంగాణ ప్రజల్లో స్ఫూర్తిని నింపారని, అందె శ్రీ, గద్దర్ లాంటి వారు తెలంగాణ ప్రజల స్వేచ్ఛను ఆకాంక్షించారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘నేను ఎవరిని శత్రువుగా చూడను. నేను శత్రువుగా చూడాలంటే వారికి ఆ స్థా యి ఉండాలి.
2006 నుంచి నా రాజకీయం ప్రారంభమైంది. 17 ఏళ్లలో ముఖ్యమంత్రిన య్యా. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశా న్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తా. నాకు నచ్చని వారిపై అధికారాన్ని ఉప యో గించే మూర్ఖుణ్ని కాదు. తెలంగాణ ప్రజలు నాపైన పెద్ద బాధ్యత పెట్టారు. నా గెలుపే నా ప్రత్యర్థులకు దుఃఖం. నేను సీఎంగా సంతకం పెట్టడం వాళ్ల గుండెలపైన గీత పెట్టినట్టుగానే ఉంది’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణు లతో జయ జయహే తెలంగాణ పాట పా డించానని, ఇంత కంటే ఇంకా ఏం కావా ల న్నారు.
‘అద్దాల మేడలు, రంగుల గోడలు అభివృద్ధి కాదు.. పేదలు ఆత్మగౌరవంతో తలెత్తు కోవ డమే అభివృద్ధి. 4 లక్షల ఇంది రమ్మ ఇళ్లతో పేదలు ఆత్మగౌరవంతో బతుక నున్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పేదల ఆత్మ గౌరవం పెంచాం. వ్యక్తిగత ప్ర యోజనాల కోసం నా పదవిని వాడను. పేద ల కోసమే పని చేస్తా. తెలంగాణ అభివృద్ధి కోసం నిరం తరం కృషి చేస్తా. 2047 నాటికి తెలం గాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్య వస్థ గా మార్చడమే నా లక్ష్యం. ప్రపంచంలో గొప్ప రాష్ర్టంగా తెలంగాణను మరుస్తా’ అని సీఎం పేర్కొన్నారు.