24-07-2025 04:49:52 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, సిరిసిల్ల శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు(KTR) జన్మదిన వేడుకలను పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్ ల ఆధ్వర్యంలో గురువారం పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పూర్ణ హోటల్ ప్రాంగణంలో, పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి నందు కేకులు కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్, మంతపురి రాజు గౌడ్ లు మాట్లాడుతూ... కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నుండి బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఆయనకు వెన్నంటి ఉండి నిత్యం అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించారన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు మున్సిపల్ శాఖ , ఐటీ శాఖల మంత్రిగా పనిచేసి దేశంలోనే తెలంగాణను ఐటీ రంగంలో అగ్ర భాగాన నిలబెట్టారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలను 20 నెలలు గడిచిన అమలు చేయకపోవడంతో నిత్యం ప్రజాక్షేత్రంలో నిలదీస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రతిక్షణం పోరాటం చేస్తున్నారన్నారు.
ఒకపక్క కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోరాటం చేస్తూ మరోపక్క బిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తూ బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు దిశా, నిర్దేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారని, కెటిఆర్ గారి పట్టుదల, కార్య దక్షత చూసి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనను అనుసరించాలని, 2028 లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పార్టీని అధికారంలోకి తెచ్చే వరకు ఆయన విశ్రమించరని, ఆయనతోపాటు మనమందరము కలిసి నడవాలని, రాబోయే రోజుల్లో కేటీఆర్ ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండి ఇంకా అత్యున్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మల్లెల రవిచంద్ర, కాలేరు సింధు తపస్వి, జూపల్లి దుర్గాప్రసాద్, సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ళ కిరణ్, ఉప్పెర్ల పుల్లారావు, కాంపాటి ప్రసాద్, కొట్టే రాఘవేంద్ర (రవి), పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, కుమ్మరి కుంట్ల వినోద్, పోసారపు అరుణ్, కాలేరు అఖిల్ మహర్షి, దరిమెళ్ళ మురళీకృష్ణ, నయీమ్, అబ్దుల్, మధు, యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.