24-07-2024 08:15:12 PM
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజున మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 7 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు సమాచారం. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్టేట్ హోమ్ లోని 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.
ఐదేళ్లు తాను చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో సంతృప్తినిస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దలు చెప్పిన్నట్లు పుట్టుక మరణం మాత్రమే నిజమని మధ్యలో మిగిలినదంతా నిజమో? అబద్దమో? తెలియని పరిస్థితి ఉంటుందని అన్నారు. అందుకే జీవితంలో మనసుకి సంతృప్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే తనకు ఎక్కువ సంతోషం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు ఆయన సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు.
