24-07-2024 08:36:41 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర గత ఆదివారం ప్రారంభం కాగా.. బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా బుధవారం 117 మందిని షీటీమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు వేలాది సంఖ్యాల్లో వస్తున్నారు. ఈ నేపథ్యంలో బోనాల వేడుకలో కొంతమంది పోకిరీలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెట్టారు. దీంతో అక్కడే ఉన్న షీటీమ్ అధికారులు పోకిరీలను అరెస్టు చేసి, మహిళలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.