02-01-2026 12:00:00 AM
ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): కొత్త సంవత్సరం తొలి రోజునే కేటీఆర్ గొబెల్స్ ప్రచారం మొదలు పెట్టారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్, హరీశ్‌రావు కలిసి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. హరీశ్‌రావు కృష్ణా, గోదావరి నదీజలాలు, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపైన దుష్పచారం చేస్తుంటే.. కేటీఆర్ యూరియా సరఫరాపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.