calender_icon.png 2 January, 2026 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి భద్రతకు ప్రజల భాగస్వామ్యం అవసరం

02-01-2026 12:00:00 AM

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి, జనవరి 1(విజయక్రాంతి): రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవం సందర్భంగా గురువారం కలెక్టర్ ఛాంబర్లో జాతీయ రహదారి భద్రత మాసోత్సవానికి సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, పాం ప్లెట్స్ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా రవాణా శాఖ అధికారి అరుణ, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, జిల్లా రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా రవాణా శాఖ జిల్లా కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, డిటిఓ అరుణ, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి రహదారి భద్రతా ప్రతిజ్ఞను చేశారు.