calender_icon.png 11 January, 2026 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు చట్టాలపై కనీస జ్ఞానం లేదు

10-01-2026 01:23:42 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సా కారం చేసిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ కుటుం బం వల్లే మంత్రి అయ్యాననే విషయం కేటీఆర్ మర్చిపోవద్దని హితవుపలికారు.

శుక్ర వారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడు తూ.. రాహుల్‌గాంధీ కుటుంబం దేశం కో సం త్యాగం చేసిందని, కేటీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని ప్రశ్నించారు. కేటీఆర్‌కు రాజ్యాంగం, చట్టాలపైన గౌరవం తోపాటు కనీసం జ్ఞానం లేదని మండిపడ్డారు. రాహుల్‌గాందీ కుటుంబానికి సొంత ఇళ్లు కూడా లేదని, వాళ్లది మీలాగా దోచుకునే కుటుంబం కాదని పేర్కొన్నారు. బీఆర్ ఎస్ హయాంలోనే తెలంగాణకు నీటి వాటాలతోపాటు అన్ని విధాలుగా అన్యాయం జరిగిందన్నారు.