10-01-2026 01:21:54 AM
రేపు బీసీల సామాజిక న్యాయ సభకు తరలిరండి
విలేకరుల సమావేశంలోబీసీ ఇంటలెక్షువల్ ఫోరం రాష్ట్ర నాయకులు ఎస్. రమేష్ గౌడ్
మహబూబ్ నగర్ టౌన్, జనవరి 9: బీసీలు ఎవ్వరు కూడా అది చేయాలి ఇది చేయాలని కోరుకోవడం లేదని, బీసీ డిక్లరేషన్ చేస్తూ 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ చెప్పిన మాట మేరకు ఆ మాటను నిలబెట్టుకోవాలని మాత్రమే చెబుతున్నామని సమావేశంలోబీసీ ఇంటలెక్షువల్ ఫోరం రాష్ట్ర నాయకులు ఎస్. రమేష్ గౌడ్ అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన జిల్లా కేంద్రంలో క్రౌన్ గార్డెన్ లో నిర్వహించనున్న పాలమూరు సామాజిక న్యాయ సభను బీసీ లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలవచ్చి విజయవంతం చేయాలని బీసీ తెలిపారు. పాలమూరు సామాజిక సభ కు ముఖ్య అతిథులు మాజీ జస్టీస్ ఈశ్వరయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, డా. విశారాధన్ మహారాజ్ లు విచ్చేయుచున్నారని అన్నారు.
బీసీ లకు 42%శాతం రిజర్వేషన్ లు బడ్జెట్ పార్లమెంట్ సమావేశంలో పెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు రాబోయే ఎన్నికలలో మున్సిపల్, జడ్ పి టి సి, ఎం పి టి సీ జనాభా దమాషా పద్దతిలో సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42%శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అన్నారు.రానున్న బడ్జెట్ లో ప్రవేపెట్టడానికి రాహుల్ గాంధీ బీజేపీ ఫై ఓత్తిడి తేవాలని అన్నారు.
బిజెపి ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఈడబ్ల్యుఎస్ ఇచ్చినట్లుగా తెలంగాణ లో బిసిలకు 42%శాతం రిజర్వేషన్ లు అమలుకు సహకరించాలన్నారు. తెరాస బీసీ ల తరుపున పోరాటం చేయాలని కోరారు. ఈ సమావేశం లో బెక్కెం జనార్దన్, లక్ష్మణ్ గౌడ్, బీసీ జాక్ రాష్ట్ర నేత సారంగి లక్ష్మి కాంత్, బీసీ నాయకులు మెట్టు కాడి ప్రభాకర్ లు పాల్గొన్నారు.