27-12-2025 01:04:49 AM
మహబూబాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు , మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలి పారు. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన విజేతలైన సర్పంచ్, ఉప సర్పం చ్, వార్డు సభ్యులను సత్కరించే కార్యక్రమం పీ ఎస్ ఆర్ గార్డెన్ లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10 గంటలకు నిర్వహిం చే ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై సర్పంచులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచులను సత్కరిస్తారని తెలిపారు.