calender_icon.png 27 December, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు

27-12-2025 01:06:56 AM

మహబూబాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): వంగవీటి మోహనరంగా వర్ధం తి వేడుకలు మహబూబాబాద్ పట్టణంలోని తొమ్మిదవ వార్డులో నిర్వహించారు. వంగవీటి మోహనరంగా చిత్రపటానికి శంతన్ రామరాజు, కమ్మగాని కృష్ణమూర్తి, గుగులోతు రాములు నాయక్, గండు మురళి, బాలరాజు, కృష్ణ, నవీన్, వెంకన్న తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివా ళులు అర్పించారు.

ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ పేదల పక్షపాతిగా నిలిచి వంగవీటి రంగా అనేక ఉద్యమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. నేటితరం రాజకీయ నాయకులకు రంగా స్ఫూర్తిదాతగా నిలుస్తారన్నారు.