02-01-2026 12:00:00 AM
గుమ్మడిదల, జనవరి 1: రైతు బాగుంటే దేశం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉం డాలని నల్లవల్లి గ్రామంలో ఉద్యానశాఖ హె చ్ ఓ జి.అనూష రెడ్డి, గ్రామ సర్పంచ్ కొరివి రాణి సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన వర్ష ఆధారిత పంటల అభివృధి పథకం కింద గురువారం రైతులకు కూరగాయల పెట్టెలను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సర్పంచ్ రాణి సురేష్ మాట్లాడుతూ నల్లవల్లి గ్రామంలో వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్నారని, గ్రామంలో కూరగాయల పంటలు బాగా పండిస్తూ పక్క గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. అలాంటి రైతులను అభినందిస్తూ వారికి ఎల్లప్పుడూ తమవంతు కృషి ఉం టుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఎర్రోళ్ల పోచయ్య, వార్డు సభ్యులు కుమ్మరి ఆంజనేయులు, కమ్మరి రాము, రాగుల నర్సింలు, మంజుల అశోక్ గౌడ్, రజని జితేందర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.