27-08-2025 02:30:15 AM
- కొత్త ఓటర్ లిస్టుతో మళ్లీ ఎన్నికల వెళ్దామా..
- కాంగ్రెస్ నేతలకు ఎంపీ రఘునందన్ సవాల్
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి):రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేస్తామని.. కొత్త ఓ టర్ జాబితాతో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌కు బీజేపీ ఎంపీ ర ఘునందన్‌రావు సవాల్ విసిరారు.
మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా తో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మహేశ్‌గౌడ్ మాట్లాడుతున్నారని, అప్పటివరకు వేచి ఉండటం ఎందుకు.. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నిలకు వెళ్దామా అని ప్రశ్నించారు. పీ సీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది మా ట్లాడటం సరికాదని హితవు ప లికారు.
తాము ఓట్ చోరీ చేస్తే కాంగ్రెస్ 8 ఎంపీ సీట్లను ఎలా గెలవగలిగిందని ప్రశ్నించారు. ఓట్ చోరీ అవకాశమే ఉంటే ఎంపీ అ సదుద్దీన్ ఒవైసీ ఎలా గెలుస్తాడన్నారు. అనవసర ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే కాంగ్రెస్ ఎంపీలు అందరూ రా జీనామా చేయాలని, కొత్త ఓటర్ లిస్ట్‌తో మళ్లీ ఎన్నికలకు వెళ్దామని సవాల్ చేశారు.
కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రజల ముందు ఉంచాలని, అప్పుడే ప్రాజెక్టు అవినీతి అంతా ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వస్తుందని, ఇది కే వలం రాష్ర్ట ప్రభుత్వం నిర్వహణ లోపమని ఆయన ఆరోపించారు.