calender_icon.png 27 August, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీడ్ హబ్‌లో నో యూరియా!

27-08-2025 02:26:48 AM

- హుజురాబాద్‌లో యూరియా కొరత

- రైతుల్లో ఆందోళన

- నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల విఫలం

హుజురాబాద్,ఆగస్టు 26:(విజయక్రాంతి) సీడ్ హబ్ గా కరీంనగర్ జిల్లా హు జురాబాద్ డివిజన్ పేరుగాంచింది. ఖరీఫ్ సీజన్లో సీడ్ పంటను తక్కువగానే సాగు చే స్తారు. ఎక్కువ శాతం రైతులు యాసంగి పం టకు సీడ్ సాగుపై మక్కువ చూపుతారు.

హు జరాబాద్ డివిజన్లో కాకతీయ కెనాల్ ద్వారా, మానేరు పరివాహ క ప్రాంతంలో ఎ క్కువగా సాగు చేస్తుంటారు. ఈ వర్షా కాలం లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పో వడంతో చెరువులు, కుంటల్లో నీరు చేరక వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 

జూలై ఆఖరివారం నుండి ఓ మోస్తరు వ ర్షాలు కురవడంతో ఆశలు చిగురించి రైతన్న లు వ్యవసాయ బావుల క్రింద వరి నాట్లు వే శారు. హుజురాబాద్ డివిజన్లో 1,07,350 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, ప్రత్తి, ఇతర పం టలు సాగు చేయగా ఇందులో ఒక్క వరి పం టనే 85,130 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న 570 ఎకరాలు, పత్తి 21 56 ఎకరాల్లో, సాగు చేశారు ఇతర పంటలు 86 ఎక రాలలో సాగు చేశారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటలు సాగు చేసి దిగుబడులపై ఆందోళన చెందుతున్న రైతాంగానికి యూరియా కొరత గో తిమీద రోకలి పోటుల పరిణమించింది.

సాగు చేసిన పంటలకు అవసరమైన యూరి యా కోసం రైతులు సొసైటీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. హుజురాబాద్ ప్రాథమిక వ్యవసా య కేంద్రానికి 10 రోజుల తర్వాత 450 యూరియా బస్తాలు రాగా రైతుల తోపులాటతో కార్యాలయంలోని కౌంటర్ అద్దాలు ధ్వంసం అయినాయి. రైతులు రాత్రి 8 గం టల వరకు కేంద్రం వద్ద పడికాపులు కాసి వె ను తిరిగారు. హుజురాబాద్ మండలానికి 15 వేల క్వింటాల యూరియా రావాల్సి ఉం డగా ఇప్పటివరకు 8000 క్వింటాల యూరి యా మాత్రమే ప్రభుత్వం సరాఫరా చేసింది.

కొరత కారణంగా ఒక్కో రైతుకు ఒకటి లే దా రెండు యూరియా బస్తాలను ఇస్తుండండటంతో రోజుల తరబడి క్యూ లైన్లు కట్టాల్సి న దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నా రు. ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలకు ఎరువు లు అందక పంటలో పెరుగుదల లేక పం ట లు ఎరుపెక్కి పోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులకు నానో యూరి యా వల్ల ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయని రైతులకు అధికారులు అవగాహన క ల్పించలేకపోయారు. నానో యూరియా వా డడం వలన భూసారం పెరుగుతుంది, పం టకు నానో యూ రియా పిచికారి చేయడం వల్ల 90% మేర మొక్కలకు చేరుతాయని రై తులను నానో యూరియా వైపు మళ్ళించడంలో అధికారులు విఫలమయ్యారు.

సరిపడా యూరియా పంపిణీ చేయాలి

ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని నర్సింగ్పూర్ కు చెందిన యువరైతు గూడూరు కోటిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చదువుకున్న చదువుకి ఉద్యోగాలు రాక ఉన్న రెండు ఎకరాలలో వ్యవసాయం చేద్దామనుకుంటే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఇప్పటివరకు ఇస్తానన్న బోనస్ ఇవ్వలేదు, వేసిన పంటలకు ఎరువులు సరిపడ ప్రభుత్వం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

 యువరైతు గూడూరి కోటిరెడ్డి, ఇప్పల్ నరసింగాపూర్

యూరియా కొరత లేదు.. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించాం

హుజురాబాద్ డివిజన్ పరిధిలో యూరియా కొరత లేదని హుజురాబా ద్ వ్యవసాయ సహాయ సంచాలకురా లు గుండా సునీత అన్నారు. రైతులు రైతులు ఎంత అవసరం ఉందో అంత యూరియానే వాడాలన్నారు గత సంవత్సరం ఖరీఫ్ సాగుతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కర్రీ పంటకి 10 శాతం వ్య త్యాసం మాత్రమే ఉందన్నారు. నానో యూరియా పై రైతులకు ప్రతి గ్రామం లో డెమోలు నిర్వహించామని, డ్రోన్లతో పిచికారి చేయించి వాటి వల్ల ఉపయోగాలను రైతులకు వివరించామని ఆమె తెలిపారు.

- గుండా సునీత హుజురాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు